ఎన్నికలో బీజేపీ పరాజయం పొందిన తర్వాత తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు. యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు భువనేశ్వర్‌లో ప్రధాని మోడి తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం, మధ్యాహ్నం 12ః15 గంటల నుంచి 2ః15 గంటల వరకు తుఫాన్ బాదిత ప్రాంతల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు. ఒడిశానుంచి మోడి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు. కలైకుండ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రధానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతం పలకనున్నారు. అనంతరం బెంగాల్ తుఫాన్‌పై ప్రధాని మోడి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షా సమావేశంలో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ లు పాల్గొననున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post