కరోనా వైరస్ కారణంగా పదోతరగతి పరీక్షలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి… ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. పరీక్షల నిర్వాహణ విషయంపై కేంద్రానికి రాష్ట్ర విధ్యాశాఖ తన అభిప్రాయం తెలిపింది. జులై మధ్యలో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. గతంలోనే ప్రశ్నాపత్రాల ముద్రణ పూర్తయ్యాయని, మార్చడం కుదరదని తెలిపింది. పరీక్షల సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరు కుదిస్తామని, రాయాల్సిన ప్రశ్నలను కూడా కుదిస్తామని, విద్యార్ధులకు ప్రశ్నలకు సంబందించిన ఛాయిస్ పెరుగుతుందని తెలిపింది. ఉదయం, సాయంత్రం వేరు వేరుగా పరీక్షలు నిర్వహిస్తామని దాని వలన తక్కువ తక్కువ మంది విద్యార్దులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. పరీక్షలు రాసేందుకు వీలు కలగని విద్యార్దులకు మరోక అవకాశం కూడా కల్పిస్తామని విద్యాశాఖ కేంద్రానికి వివరించింది.
previous post