telugu navyamedia
క్రీడలు వార్తలు

అంత సీన్ నీకు లేదు… అమీర్ కు కనేరియా పంచ్..!

పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్న అమీర్.. బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమీర్.. రోహిత్ శర్మని తాను సులువుగా ఔట్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ గురించి మహ్మద్ అమీర్ చులకనగా మాట్లాడటంపై డానిష్ కనేరియా ఘాటుగా స్పందించాడు. రోహిత్‌ను ఔట్ చేసే సీన్ అమీర్‌కు లేదన్నాడు. ‘వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. అతను రన్ మెషిన్. పేసర్లతో పాటు స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను సమర్థంగా ఆడగలడు. అలాంటి బ్యాట్స్‌మన్‌ గురించి వార్తల్లో నిలిచేందుకు చులకనగా మాట్లాడతావా అమీర్.? నువ్వు స్వింగ్‌తో పాటు పేస్‌ను కూడా గత రెండేళ్లుగా రాబట్టలేకపోతున్నావు. దాంతో పాక్ జట్టు నుంచి వేటుకి గురయ్యావు. అలాంటి నువ్వు రోహిత్ శర్మని రెండు విధాలుగా ఔట్ చేస్తానని చెప్తున్నావు. నాకేతై ఇది సమంజసంగా అనిపించడం లేదు. రోహిత్ శర్మ నీకంటే సీనియర్.. హైక్లాస్ బ్యాట్స్‌మెన్’అని కనేరియా చురకలంటించాడు.

Related posts