telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ లో తగ్గనున్న కోవిద్ వ్యాక్సిన్ రేటు…?

corona vaccine covid-19

భారత్ ను గత ఏడాది మొత్తం కరోనా అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కరొనకు ఈ ఏడాది జనవరి నుండి వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. దాంతో పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ప్రతిరోజూ 20 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  మార్చి 1 వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు వ్యాక్సిన్ అందిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను కేంద్రం రూ.210 కి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.  కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ ను ఒక్కో డోస్ ధర రూ.250గా నిర్ధారయించింది కేంద్రం.  రెండు డోసులు కలిపి రూ.500గా ఉంది.  అయితే, ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో వ్యాక్సిన్ ధరలు తగ్గించే ఆవకాశం ఉన్నట్టు సమాచారం.  కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇదే విషయాన్ని సూచనా మాత్రంగా తెలిపింది.  ఒక్కో వ్యాక్సిన్ డోస్ ఖరీదు రూ. 200లోపే ఉండే విధంగా చర్యలు తీసుకుంటోంది. చూడాలి మరి ఇది ఎప్పటికి జరుగుతుంది అనేది.

Related posts