telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్” ఫస్ట్ డే కలెక్షన్స్

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మించారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషించారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇది ఒక రివేంజ్ డ్రామా. మరోసారి విక్ర‌మ్ కే కుమార్ త‌న మార్క్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. ఈరోజు అంటే సెప్టెంబర్ 13న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కాగా గ్యాంగ్ లీడర్ విడుదలకు ముందు ఎలాంటి సందడి చేయలేకపోయింది. దాంతో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలకావడంతో భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక కల్లెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఈ చిత్రం మొదటి రోజు 1.69కోట్ల షేర్ ను రాబట్టగా ఓవర్సీస్ లో ప్రీమియర్ల తో కలుపుకొని 350k డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇంతకుముందు జెర్సీ మొదటి రోజు నైజాంలో 1.93 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మొదటి రోజు 450k డాలర్ల ను రాబట్టింది. అయితే వారాంతం కావడం అలాగే టాక్ కూడా బాగుండడంతో గ్యాంగ్ లీడర్ శని, ఆదివారాల్లో మొదటి రోజు కన్నాఎక్కువ వసూళ్లను రాబట్టుకునే అవకాశాలు వున్నాయి.

Related posts