telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” నుంచి మరో కొత్త పోస్టర్… ఈసారి ఎవరంటే ?

Saaho

“బాహుబ‌లి” చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం “సాహో”. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్, సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాలో హీరోకు ధీటుగా ఉండే విలన్ పాత్రధారి ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేశ్ ఫస్ట్ లుక్ ని, ప్రభాస్ బాక్సింగ్ శిక్షణ పొందుతున్న ఓ వీడియోను సోమవారం రోజున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ఈ చిత్రం నుండి అరుణ్ విజ‌య్ లుక్ విడుద‌ల చేశారు. తాజాగా దేవ‌రాజ్ పాత్ర పోషిస్తున్న చుంకీ పాండే లుక్‌ని విడుద‌ల చేసింది. ఇందులో చుంకీ సిగార్ తాగుతూ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సినిమాలో మీకు మ‌రింత చిల్‌ని ఆయ‌న అందించ‌నున్నారు అని యూవీ క్రియేష‌న్స్ సంస్థ తెలిపింది.

Related posts