telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“దిశ ఎన్కౌంటర్” ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ

Disha

వివాదాలకు మారుపేరుగా మారిన ఈ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వర్మ.. నవంబ‌ర్ 26, 2019న ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జరగగా, న‌వంబ‌ర్ 26, 2020న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నట్టుగా వర్మ వెల్లడించాడు. కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ‘దిశ ఎన్కౌంటర్’ అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఓ స్కూటి, లారీ, ఓ నిందితుడు పరిగెత్తుతూ ఉండడం, ఒకరు గన్ తో గురిపెట్టడం లాంటివి చూపించాడు వర్మ. ఫస్ట్ లుక్ తో సినిమా పైన బాగా హైప్ క్రియేట్ చేశాడు. ఈ లాక్ డౌన్ సమయంలో సంచలన దర్శకడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కరోనా వైరస్, నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను తెరకెక్కించి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Related posts