telugu navyamedia
సినిమా వార్తలు

“గ్యాంగ్ లీడర్”గా ఫిక్స్ అయిన నాని

nani

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం “జెర్సీ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చేయనున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం మేఘా ఆకాష్, సాయి పల్లవి, ప్రియాంక ఆరుళ్ వంటి హీరోయిన్లను ఎంపిక చేసుకున్నారని సమాచారం. నిన్న నాని పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ను “గ్యాంగ్ లీడర్ గా ప్రకటిస్తూ, దానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. గతంలో చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో “గ్యాంగ్ లీడర్” కూడా ఒకటి. ఈ టైటిల్ ను వాడుకోవాలని రామ్ చరణ్, సాయి ధరం తేజ్ ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆ అవకాశాన్ని నాని కొట్టేశాడు. ఆగస్ట్ లో రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టీజర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Related posts