కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ప్రస్తుతం ఎస్.కృష్ణ దర్శకత్వంలో “పహిల్వాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో “పహిల్వాన్” అనే టైటిల్ తో విడుదల కానుంది. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయించారు. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. “బలం ఉందనే అహంతో కొట్టేవాడు రౌడీ… బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు” అనే డైలాగ్ ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న చిత్రం విడుదల కానుంది. సుదీప్ తెలుగులో ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అక్షాంక్షసింగ్, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు మాట్లాడుతూ “స్ఫూర్తినిచ్చే చిత్రాల్లో “పహిల్వాన్” ఒకటి. సుదీప్‌గారు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. హార్డ్‌వర్క్ తప్పకుండా ఫలితాన్ని అందుకుంటుంది” అన్నారు.
previous post
next post
“రజనీకాంత్ శరీరం అంత క్రిటికల్‌గా ఉంది మరి”… దర్శకుడి షాకింగ్ కామెంట్స్