దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. ఆర్.ఆర్.ఆర్ సంక్షిప్త నామాన్ని విస్తరిస్తూ అనేక టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే రీసెంట్‌గా రాజమౌళితో పాటు ప్రభాస్, అనుష్క, రానా, నిర్మాతలు ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా స్క్రీనింగ్ కోసం లండన్ వెళ్లారు. లండన్ నుండి రాజమౌళి తిరిగి రావడంతో షూటింగ్ ఊపందకుంది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ఇందులో ఉత్కంఠ రేపే సన్నివేశాలతో పాటు అలరించే పాటలు ఎనిమిది ఉంటాయట. ఆ పాటలు దేశభక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ అని కొందరు చెబుతుండగా, వాటితో పాటు హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయని మరికొందరు అంటున్నారు. సుద్దాల అశోక్ తేజ స్వాతంత్య్రకాంక్షని పెంచే మూడు సాంగ్స్ రాస్తున్నారని తెలుస్తుండగా, మిగతా పాటలు ప్రముఖ లిరిసిస్ట్స్ రాస్తున్నట్టు టాక్. కీరవాణి చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే .
previous post