కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం తెలుగులో “డియర్ కామ్రేడ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. “డియర్ కామ్రేడ్” సినిమా తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పాటల పండగ చేస్తోంది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడింది. “నాకు కాబోయే భర్త అందరితో కలిసి పోయేవాడా, కాదా అన్నది పట్టించుకోను. అయితే అతను నిజాయితీగా ఉండాలి. అతని సమక్షంలో ఉండడాన్ని నేను ఆస్వాదించగలగాలి. అంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు. అతనితో ఎక్కువ సమయం గడపాలని నాకు అనిపించాలి” అని రష్మిక చెప్పింది. గతంలో రక్షిత్ శెట్టి అనే కన్నడ నటుడితో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగి, పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక రష్మిక ప్రస్తుతం మహేష్ 26వ సినిమా “సరిలేరు నీకెవ్వరూ” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
previous post