తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న అనసూయను అందరూ తరచుగా ‘ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్ ?’ అని అడుగుతున్నారట. ఈ ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో అనసూయ ఒక పోస్ట్ పెట్టింది. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. “అనసూయ.. ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకోకపోతే టాప్ హీరోయిన్ అయిపోయేదానివి. కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నీ డిమాండ్ తగ్గిపోతుంది కదా` అని నా మంచి కోరే శ్రేయోభిలాషులు నన్ను తరచుగా అడుగుతుంటారు. ఈ రోజు అందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే.. జీవితంలో నేను పొందిన వాటికి నేను సిగ్గుపడడం లేదు. గర్వపడుతున్నా. నేను పొందిన వాటిలో అన్నింటి కంటే గొప్పది నా కుటుంబం. మనం ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు పనిచేసేది కుటుంబంతో సంతోషంగా ఉండడానికే కదా. మగవారికి లేని హద్దులు ఆడవారికెందుకు ?” అని అనసూయ ప్రశ్నించింది.
previous post
next post