telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీఎం కేసీఆర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు

Chiru

లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్స్ ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం ప్రగతిభవన్‌లో కలిశారు. సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకు చెందిన సమస్యలను కేసీఆర్ సానుకూలంగా విన్నారని, త్వరలోనే మంచి కబురు ఆయన చెప్పనున్నారని తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

Tollywood

సమస్యలను సానుకూలంగా విన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్‌గారికి పరిశ్రమలోని యావన్మంది తరుపున కృతఙ్ఞతలు. ఈ రోజు వారు సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలు సానుకూలంగా విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tollywood

వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందించి, అందరికి మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. సమస్యలను సానుకూలంగా విన్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్‌గారికి సినిమా, టీవీ, డిజిటల్ మీడియా ఇండస్ట్రీస్ అందరి తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tollywood

Related posts