telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’… నిర్భయ దోషుల ఉరిపై అనసూయ ట్వీట్

Anasuya-bharadwaj tollywood

ఇవాళ ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా అనసూయ హిందీలో ట్వీట్ చేసింది. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. న్యాయోదయం… కాస్త ఆలస్యం అయినా సరైనది ’ అంటూ అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది అనసూయ. కొందరు ఆమె పెట్టిన పోస్టుకు అర్థం ఏంటని అడుగుతున్నారు. మరికొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు న్యాయం గెలిచిందని ట్వీట్ చేస్తున్నారు.

Related posts