రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని గోపాల్‌పేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సింగిల్ విండో కార్యాలయం, దుకాణాల సముదాయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు పండించిన పంట మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.