చందా కొచ్చర్, ఐసిఐసిఐ బ్యాంకు పై న్యాయపోరాటం ప్రారంభించింది. తన ఉద్యోగం తొలగింపు, 2009నుంచి 2018 మధ్య ఇచ్చిన బోనస్‌లు, స్టాక్‌లు తిరిగి ఇవ్వాల్సిందిగా చందాకొచ్చర్‌ను బ్యాంకు బోర్డు కోరింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరు సభ్యులు జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ మకరంద్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 2న ఇరుపక్షాల వాదనలు విననుంది.
వీడియోకాన్ గ్రూప్‌కు ఐసిఐసిఐ బ్యాంకు రుణం ముంజూరు చేయడంపై వివాదం చెలరేగింది. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు బోర్డు ఆమెను తన పదవి బాధ్యతల నుంచి తాత్కాలికంగా తొలగించింది. అయితే ఇంతకు మునుపు ఈ అంశంపై సిబిఐ దర్యాప్తు చేపట్టి, జూన్ నెలలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్ శ్రీకృష్ణను ఈ కేసులో విచారణ చేసేందుకు సిబిఐ నియమించింది.