*ద్వేషం కాదు ..దేశం ముఖ్యం..
*మోడీ ప్రభుత్వం కాదు ఏడి ప్రభుత్వం
*దేశ ప్రజల మనసుల్లో విషం నింపే కుట్ర జరుగుతోంది
*పచ్చగా ఉన్నతెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం జరుగుతోంది
*ప్రజల దృష్టి మరల్చేందుకే…బీజేపీ విద్వేషాలు నింపుతోంది
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం జరుగుతోందన్నారు. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇది మోడీ ప్రభుత్వం కాదని.. అటెన్షన్ డైవర్షన్ (ఏడి) ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు . అసలు దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందన్నారు.
మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రేనని కేటీఆర్ ఆరోపించారు. భారమవుతున్న నిత్యవసరాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అని, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర అన్నారు.
ఈ కుట్రను కనిపెట్టకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టమన్నారు.దేశం కోసం.. ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదమని, విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని ఆరోపించారు. హర్ ఘర్ జల్ అన్నారు కానీ.. హర్ ఘర్ జహర్ (విషం) అనీ.. ప్రతి మనసులో విషయాన్ని నింపే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తాడు.
కేసీఆర్ కుర్చి పోయే కాలం వచ్చింది: కోమటిరెడ్డి