telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలుగు అకాడమీ కేసులో మ‌రో 4 రోజులు నిందితులకు కస్టడీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్న పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్‌ చేశారు. తొమ్మిది మందిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సీసీఎస్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేసిన మరో ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఈ కేసులో మూడు ప్రధాన అంశాలుగా పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.అకాడమీ అధికారులు, ఉద్యోగుల పాత్ర, పథకాన్ని రచించిన సూత్రధారులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల పాత్ర.. ఇలా వేర్వేరుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ నాలుగు రోజుల్లో వీరు విచారణకు సహకరించట్లేదని, .. నిందితులు కాజేసిన రూ.64 కోట్లు ఏం చేశారనేది ఇంకా వెల్లడి కాలేదు. డిపాజిట్ల మళ్లింపు, వాటాల పంపకంపై ఇప్పటికీ పూర్తి సమాచారం లభించలేదు. వారు కావాలనే వాస్తవాలు దాస్తున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు నిందితులను మరో 4 రోజులు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. కస్టడీ పొడిగింపుపై నేడు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

 

Related posts