telugu navyamedia
తెలంగాణ వార్తలు

సిటీ సివిల్‌ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట..ఢిల్లీ బీజేపీ నేత‌ల‌కు నోటీసులు

*సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ క‌విత‌కు ఊర‌ట
* ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో  కవితకు ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిన కోర్టు
*ఢిల్లీ బీజేపీ నేత‌ల‌కు నోటీసులు
*సోష‌ల్ మీడియా, మీడియాలో వ్యాఖ్య‌లు చేయోద్ద‌న్న కోర్టు..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిటీ సివిల్‌ కోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసు వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత బిజెపి నాయకులపై వేసిన పరువు నష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

క‌విత పేరును కేసులో ఎక్కడా ఎవరూ వాడొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులైన బీజేపీ ఎంపీ పర్వేశ్ శర్మ మాజీ ఎమ్మెల్యే మంజింధర్‌ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడ వాడొద్దని పేర్కొంది.

సభలు, మీడియా, సోషల్ మీడియాలో ఆమె పేరు వినియోగించవద్దని, నిరాధార ఆరోపణలు చేయవద్దని వారికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 13 కు వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కవితపై నిరాధార ఆరోపణలు చేశారని ఆమె తరపున పిటిషన్ దాఖలైంది. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తులు జాతీయ పార్టీ సభ్యులు కావడంతోనే మీడియా లో కథనాలు వచ్చాయి. ఈమేరకు పలు మీడియా చానల్స్‌లో వచ్చిన వరుస కథనాలను కోర్టుకు సమర్పించారు కవిత తరుఫు న్యాయవాది. బాధ్యత యుతమైన పదవిలో ఉన్నవారు ఆధారాలతో ఆరోపణలు చేయాలి కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు

Related posts