telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్ లైన్ కాల్ మనీ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణ…

Money

ఆన్ లైన్ కాల్ మనీ కేసులో సీసీఎస్ పోలీసులు విచారణ కొనసాగుతుంది. దేశంలో మూడు ప్రదేశాల్లో కాల్ సెంటర్లు పై దాడి చేసారు పోలీసులు. రుణం చెల్లించిన వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదు చేసారు. అయితే పంజాగుట్ట, బేగంపేట్ కాల్ సెంటర్ల లో పని చేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు సీసీఎస్ పోలీసులు. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి రాని తమ పిల్లలు పై ఆందోళన చెందుతున్నారు తల్లి దండ్రులు. మీడియా లో వస్తున్న వార్తలను చూసి సీసీఎస్ కి వస్తున్నారు. తమ పిల్లలకు ఏమి జరిగిందోనన్న ఆందోళన లో తల్లిదండ్రులు ఉన్నారు. ఉద్యోగం చేస్తున్న తమ పిల్లలను తీసుకురావడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. అయితే ఈ విషయం పై మాట్లాడిన తల్లి దండ్రులు… నా కొడుకు సిస్టమ్ అడ్మిన్ గా పని చేస్తున్నాడు. మూడు నెలలు క్రితమే బేగంపేట్ లో ఉద్యోగం లో చేరాడు. కాల్ సెంటర్ కు మా అబ్బాయి కి సంబంధం లేదు. మా అబ్బాయి చాలా భయస్తుడు, ఇలాంటి కాల్ సెంటర్ ఒకటి ఉందని మా తో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మీడియా లో వచ్చిన తరువాతనే మాకు ఈ యాప్ ల గురించి తెలిసింది. మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదు అని పేర్కొన్నారు. అయితే మైక్రో ఫైనాన్స్ యాప్ లకు ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారించారు పోలీసులు.

Related posts