telugu navyamedia
సినిమా వార్తలు

చరణే నా గౌరవం- చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో కెరీర్ లో జెట్ స్పీడ్ లో దూసుకుని పోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈరోజు రామ్ చరణ్ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు

చెర్రీ న‌టించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ గత శుక్రవారం(మార్చి 25) విడుదలై..పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు తమ అభిమాన హీరో రామ్‌ చరణ్‌ బర్త్‌డేని మరింత ఘనంగా సెలెబ్రేట్‌ చేసుకుంటున్నారు. లక్షలాది మంది ఫ్యాన్స్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు సోష‌ల్ మీడియా వేదికగా చరణ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి కూడా చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఓ అరుదైన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ పిక్‌ ఒకటి షేర్‌ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

తండ్రి చిరంజీవితో కలిసి చరణ్‌ నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Related posts