telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నర్సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

narsing

టాలీవుడ్ సీనియర్ నటులు నర్సింగ్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం నర్సింగ్‌కు వెంటిలేర్‌పై చికిత్స అందిస్తున్నారని ఆయన భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. నిజానికి, నర్సింగ్ యాదవ్ ఇంట్లో పడిపోయారని.. ఆయన తలకు బలమైన గాయమైందని మొదట వార్తలు వచ్చాయి. అయితే, దీనిలో వాస్తవం లేదని చిత్ర చెప్పారు. అనుకోకుండా కోమాలోకి వెళ్లిపోయారు. 48 గంటలు పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది. ఇంట్లో కింద పడిపోయారు, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవం. తను ఎక్కడా పడిపోలేదు. ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయారు. కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి. అని చిత్ర యాదవ్ కోరారు.

Related posts