telugu navyamedia
సినిమా వార్తలు

“కాంచన” హిందీ రీమేక్… మళ్ళీ లారెన్స్ చేతికే…!

Raghava-Lawrence

రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హారర్‌, కామెడీ చిత్రం “కాంచన” హిందీలో రీమేక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తుండగా… ఈ చిత్రానికి “లక్ష్మి బాంబ్‌” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు లారెన్స్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ముంబైలో షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో నిర్మాత తనకు తెలియకుండా పోస్టర్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారని, తనను అవమానించారని, తాను ఈ చిత్రం దర్శకత్వం నుంచి తప్పుకుంటున్నట్టు లారెన్స్‌ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాల మధ్య మళ్లీ ఈ చ్రితంలో లారెన్స్‌ పనిచేయనున్నాడు. లారెన్స్ ను అవమానించిన నిర్మాత చెన్నై వచ్చి లారెన్స్‌తో మంతనాలు జరిపారని, అందుకే మళ్లీ దర్శకత్వం వహించేందుకు లారెన్స్‌ అంగీకరించారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌లో లారెన్స్‌ పాల్గొననున్నారని తెలుస్తోంది.

Related posts