telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ?

Jr.ntr actor Ycp photos social media

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరంభీమ్‌గా కన్పించనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా 2021 జనవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని, ‘అయినను పోయిరావలెను హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇక దీని తర్వాత ప్రముఖ తమిళ్ రైటర్, డైరెక్టర్, నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వెట్రిమారన్‌‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా ‘అసురన్’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ అందించిన వెట్రిమారన్ సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ‘ఆడుకలం’, ‘NH 4’, ‘కాక్కా ముట్టై’, ‘విసారణై’ (తెలుగులో విచారణ), ‘కోడి’ (తెలుగులో ధర్మయోగి), ‘వడ చెన్నై’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఎన్టీఆర్, వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

Related posts