telugu navyamedia
సినిమా వార్తలు

అన్న‌య్య‌కు ప్రేమ‌తో..పవన్‌ ఎమోషనల్‌ విషెస్‌

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అంతా ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే హీరో చిరంజీవికి ఆయన తమ్ముడు, హీరో పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. అన్న మీద తనకున్న ప్రేమను అభిమానాన్ని మరోసారి పంచుకున్నారు. మెగాస్టార్ కు తమ్ముడిగా పుట్టటం తన అదృష్ణమని అన్నాడు.

Chiranjeevi COVID-19 | Pawan Kalyan wishes South superstar Chiranjeevi a quick recovery from COVID-19

‘చిరంజీవి నాకే కాదు ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి, మరెందరికో స్పూర్తి ప్ర‌దాత‌. ఆద‌ర్శ‌ప్రాయుడు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కొన్ని మిగిలే ఉంటాయి. త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం. ఆయ‌న సుగుణాల‌ను చూస్తూ పెర‌గ‌డం మ‌రో అదృష్టం. అన్న‌య్య‌ను ఆరాధించే కోట్లాది అభిమానుల‌లో నేను ఒక‌డిని. ఆయ‌న అస‌మాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండ‌డం ఆయ‌న‌లోని అద్భుత ల‌క్ష‌ణం.

Ahead of 'Vakeel Saab' release, Chiranjeevi shares throwback pic with Pawan Kalyan | Telugu Movie News - Times of India

సినీ య‌వ‌నిక‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నప్పటికీ… ఎన్ని అవార్డులు వచ్చినా, చ‌ట్ట స‌భ స‌భ్యునిగా, కేంద్ర‌మంత్రిగా ప‌ద‌వులు అలంక‌రించినా త‌ల ఎగ‌రేయ‌లేదు. రికార్డులు ఎన్ని సృష్టించిన అదే విధేయ‌త‌, అదే విన‌మ్ర‌త‌. అందుకే అంద‌రు ఆయ‌న‌ను సొంత మ‌నిషిలా భావిస్తుంటారు. దానాలు, గుప్త దానాలు ఎన్నో చేశారు.

Pawan Kalyan Releases Statement After Brother Chiranjeevi Tested Positive For COVID-19 - Filmibeat

కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారని, కోరిన ప్రతి ఒక్కరికీ సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారని ప్రశంసించారు. అన్నగా పుట్టినప్పటికీ తమను తండ్రిలా సాకారని, ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అన్నయ్యకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

Two hearts, one soul: Chiranjeevi pens an emotional note on Pawan Kalyan's birthday | Telugu Movie News - Times of India

Image

Related posts