telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“విజయ్ సేతుపతి” కథ పవన్ కళ్యాణ్ కోసమే… !

Vijay-Sethupathi

విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా జంటగా విజయా ప్రొడక్షన్ వారి నిర్మాణంలో తమిళంలో నిర్మాణమవుతున్న ‘సంగతమిళ్’ మూవీని హర్షిత మూవీస్ వారు తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో విడుదల చేయనున్నారు. రెండు భాషల్లో నవంబర్ 15న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్‌లో సెల్ఫ్ మేడ్ స్టార్స్‌లో విజయ్ సేతుపతి స్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘సైరా’తో నేరుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఆదరణ ఉంది. త్వరలోనే ఆ ఆదరణ ‘విజయ్ సేతుపతి’తో మరింత పెరుగుతుందని చిత్ర యూనిట్ అంటుంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు సముద్ర చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ..విజయ్ సేతుపతి సినిమా కథను పవన్ కల్యాణ్ కోసం రాశానన్నాడు. అయితే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పనులతో బిజీగా ఉండటంతో..అదే కథను తమిళంలో విజయ్ సేతుపతితో తీశానని చెప్పాడు. ఇక్కడ పవన్ కల్యాణ్ కున్నట్లుగానే తమిళంలో విజయ్ సేతుపతికి మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి కథను విని ఒకే చెప్పడంతో సెట్స్ పైకి వెళ్లిందని అన్నాడు. ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడని, డ్యుయల్ రోల్ లో సందడి చేస్తాడని చెప్పాడు. విజయ్ చందర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం తెలుగు ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts