పటాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి..ఇప్పటివరకు ఆయన తీసిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే..కామెడీ టైమింగ్, ఎమోషన్స్‌తో అనిల్ సినిమాలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించేస్తాయి
తాజాగా..విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్ హీరోయిన్స్ మెహరీన్, సోనాల్ చౌహన్ కలిసి నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీ ‘ఎఫ్ 3’ . ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘థంబ్‌నేయిల్స్ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.’ అని అనిల్ రావిపూడి తెలిపారు.
అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు.
తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సారి కంటెస్టెంట్లు బోర్ కొట్టిస్తున్నారు..