telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమా కోసం ప్రేమను త్యాగం చేసిన దివి

Divi

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్-4కు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న న‌టిస్తున్న‌ ‘వైల్డ్‌డాగ్’ షెడ్యూల్‌లో బిజీగా ఉండ‌టంతో 21 రోజుల త‌ర్వాతే మ‌ళ్లీ బిగ్‌బాస్ షోలో క‌నిపించనున్నారు. ఈ క్ర‌మంలో నాగ్ బాధ్య‌త‌ను ఆయ‌న‌ కోడ‌లు స‌మంత త‌న భుజాల మీద వేసుకుని ద‌స‌రా స్పెష‌ల్ బిగ్‌బాస్ మెగా ఎపిసోడ్‌ను నడిపించింది. ఇక ఈ ఎపిసోడ్ లోనే సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య ఎలిమినేట్ అయ్యింది‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం ఉన్న దివి అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో చేసిన స్నేహ‌మే ఆమెకు శాపంగా మారింది. ఈ కార‌ణం వ‌ల్లే ఆమెకు మోనాల్ క‌న్నా త‌క్కువ ఓట్లు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. దీంతో ద‌స‌రా పండ‌గ రోజే అంద‌రి నుంచి న‌వ్వుతూనే సెల‌వు తీసుకుంది. అయితే దివి కుటుంబం, బ్రేక‌ప్ స్టోరీ గురించి మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అందులో దివి మాట్లాడుతూ “అమ్మ లెక్చ‌ర‌ర్‌, నాన్న హెచ్‌సీయూలో ల్యాబ్ టెక్నీషియ‌న్‌. నేను పుట్ట‌క‌ముందే హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. బీటెక్ త‌ర్వాత ఉద్యోగం చేయ‌డం ఇష్టం లేక ఎంటెక్‌లో జాయిన్ అయ్యా… ఆ స‌మ‌యంలో నేను ర్యాంప్ వాక్ చేసి అంద‌రి క‌ళ్ల‌ల్లో ప‌డ్డాను. నా కాంటాక్ట్ లిస్ట్ పెరిగిపోయింది. అలా సినిమాల్లోకి ప్ర‌వేశించాను. నేనూ ప్రేమ‌లో ప‌డ్డాను.  నా బాయ్‌ఫ్రెండ్‌ వాళ్ల త‌మ్ముడు మ‌లేరియాతో చ‌నిపోయాడు. ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. న‌న్ను పల్లెటూరుకు ర‌మ్మ‌న్నాడు. చిన్న‌ప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లో పెరిగాను. ప‌ల్లెటూరు నాకు అల‌వాటు లేదు. అయినా కూడా వెళ్లొచ్చు కానీ అప్ప‌టికే మా ఇద్ద‌రికీ రెండు సంవ‌త్స‌రాలు గ్యాప్ వ‌చ్చింది. పైగా నాకెంతో ఇష్ట‌మైన మోడ‌లింగ్‌, సినిమాలు వ‌దిలేసుకోమ‌న్నాడు. దీంతో నాకు న‌చ్చింది నేను చేస్తాన‌ని ప్రేమ‌ను వ‌దిలేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏ రిలేష‌న్‌లో లేను. సింగిల్‌గా ఉంటేనే బెట‌ర్ అనిపిస్తోంది” అని దివి సినిమా కోసం ప్రేమ‌ను త్యాగం చేసానని చెప్పుకొచ్చింది. కాగా దివి ఎలిమినేట్ కావడంతోనే స్టేజ్ పైనే సినిమా ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.

Related posts