telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ కు కూతురును పరిచయం చేయబోతున్న స్టార్ హీరో

Aishwarya

టాలీవుడ్‌లో స్టార్ వారసులు చాలామందే ఉన్నారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలయ్యారు. కాగా… ఇప్పుడు అటు కన్నడ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన సీనియర్ హీరో అర్జున్ తన డాటర్‌ని తెలుగు సినిమాకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాని స్వయంగా ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడట. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలతో కూడా అక్కడి ఆడియన్స్‌ని ఆకట్టుకున్న అర్జున్.. తన కూతురు ఐశ్వర్యని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. తన కూతురి సినిమాకి అతనే దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే నిర్మాత కూడా ఓకే అన్నారు. ఇంకేముంది.. త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టనున్నారని సమాచారం. కాగా ఐశ్వర్య 2019లో విశాల్ హీరోగా నటించిన ‘పట్టాత్తు యావై’ అనే కన్నడ సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు అవి పెద్దగా ఆమె కెరీర్ కు ఉపయోగపడకపోవడంతో ఇప్పుడు స్వయంగా అర్జున్ తన కూతురును టాలీవుడ్‌కి పరిచయం చేయాలని చూస్తున్నారు.

Related posts