telugu navyamedia
సినిమా వార్తలు

‘బాహుబలి’కి మించి ఆర్ఆర్ఆర్​పై అంచనాలు

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ జీవిత నేపథ్యంతో సినిమా తెర‌కెక్కించారు.

ఆకట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ పోస్టర్స్..

సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో అంటే మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్పటికే అన్ని భాషల్లో క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ.
ఈ మూవీ 60 దేశాల్లో రికార్డు స్థాయి స్క్రీన్ లలో విడుదలవుతోంది. ఐదు భాషల్లో 2డీ 3డీ ఐమాక్స్ ఫార్మాట్ లలో విడుదలవుతుంది.

ఆకట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ పోస్టర్స్..

ఆర్ఆర్ఆర్ గత చిత్రాల వసూళ్లును దాటుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై ప్రేక్షకుల్లో రెట్టింపు అంచనాలు, టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వాలు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయడం ఆర్ఆర్ఆర్‌కు బాగా కలిసి వచ్చే అవకాశంగా ఉంది. అలాగే విదేశాల్లో మార్చి 24నే 1200 థియేటర్లలో ఆర్ఆర్ఆర్​ను ముందస్తుగా ప్రదర్శిస్తున్నారు. విడుదలకు ముందే 1000 కోట్ల వ్యాపారం చేసిన ఆర్ఆర్ఆర్… విడుదలైన మొదటి మూడు రోజుల్లో బాహుబలి-2 పేరుతో ఉన్న 500 కోట్ల రూపాయల రికార్డును తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ పోస్టర్స్..

రాజమౌళి బ్రాండ్ వేల్యూకి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ తోడు కావడంతో డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మేకింగ్ కాస్ట్ వచ్చేసింది. థియేట్రికల్ బిజినెస్ నిర్మాత డీవీవీ దానయ్యకు బోనస్. అందులోంచి రెమ్యూనరేషన్స్ తీసేసినా… లాభాలు గ్యారెంటీ అంటున్నారు.

తొలివారంలోనే ఈ సినిమా సుమారు 3వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమా అగ్రభాగాన నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆకట్టుకుంటున్న ఆర్ఆర్ఆర్ పోస్టర్స్..

అంతే కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 211 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.’ఆర్ఆర్ఆర్’ డిజిటల్, శాటిలైట్, హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 475 కోట్లకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతి లాల్ గడా తీసుకున్నారట. థియేట్రికల్ మినహా మిగతా రైట్స్ రూ. 335 కోట్లకు అమ్మేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్సీస్ రైట్స్ కూడా రూ. 1000 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

Related posts