telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ 3 లో .. ఉదయభాను పారితోషకం .. రోజుకు రెండు లక్షలు..

udayabhanu is highest remuniration in bigg boss 3

బుల్లి తెరపై పెద్ద షో ‘బిగ్ బాస్’ మొదటి భాగానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ రియాలిటీ షోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దానితో నాని వ్యాఖ్యాతగా ‘బిగ్ బాస్ 2’ ప్రసారమైంది. తనదైన శైలిలో నాని కూడా ఈ రియాలిటీ షోను రక్తికట్టించాడు. ఇక ‘బిగ్ బాస్ 3’ షోకి హోస్ట్ గా నాగార్జునను ఖరారు చేసుకున్నారు. ‘బిగ్ బాస్ 2’ విషయానికొస్తే పార్టిసిపెంట్స్ ఎంపిక విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అందువలన ‘బిగ్ బాస్ 3’ పార్టిసిపెంట్స్ విషయంలో నిర్వాహకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట.

ఈ సారి కూడా వివిధ రంగాలలో మంచి క్రేజ్ వున్న వారిని మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆ జాబితాలో ఉదయభాను పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యాంకర్ గా .. నటిగా ఉదయభానుకు మంచి క్రేజ్ వుంది. అందువలన ఆమెను తీసుకున్నారని అంటున్నారు. ఎలిమినేట్ అయ్యేంతవరకూ రోజుకి 2 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పేసి నిర్వాహకులు ఆమెను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఈ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకునేది ఆమెనేనని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది షో తరవాత కూడా తెలుస్తుందో లేదో.. చూడాలి.

Related posts