telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ” సెన్సార్ పూర్తి

“జెర్సీ” తో గ్రాండ్ గా మరోసారి నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, ఎమోషన్ సీన్స్ తో కూడిన ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకుపోతూ ఇప్పటివరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. రంజీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. సోమవారం సాయంత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఈ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

Related posts