telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : విన్నర్ శ్రీముఖి… ఫోటో వైరల్

bigg-boss

ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3కు ఈ ఆదివారం (నవంబర్‌ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్‌’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే గ‌త‌వారం శివ‌జ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లు ఉండ‌వు. శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, అలీరెజా, రాహుల్‌, వ‌రుణ్ సందేశ్‌లు ఫైన‌ల్‌కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవ‌ర‌నే దానిపై ప్ర‌స్తుతం హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. ఇక నెటిజన్లు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ కు ఓట్లు వేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ముగియనుంది. తాజాగా బిగ్‌‌బాస్-3 విన్నర్‌పై ఓ ఆసక్తి‌కర ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్-3 ఫైనల్ విజేత శ్రీముఖి అని, విన్నర్‌గా ఆమె ట్రోఫీని తీసుకుని హోస్ట్ నాగార్జునతో దిగిన ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీంతో బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖినేని ట్రోల్ అవుతోంది. కానీ ఈ ఫొటో ఎలా వచ్చిందనేదానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అటు బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా స్పందించలేదు. మరి బిగ్‌బాస్ విన్నర్‌పై సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో ఫేకా ?.. ఒరిజినలా ?.. అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Related posts