telugu navyamedia
సినిమా వార్తలు

దొరసాని : “కళ్ళలో కలవరమై…” వీడియో సాంగ్

Dorasani

“దొరసాని” చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నారు. 80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ “దొరసాని”పై అంచనాలను పెంచాయి. మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా… ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు చిత్ర టీం. తాజాగా ఈ చిత్రం నుంచి “కళ్ళలో కలవరమై…” అనే వీడియో సాంగ్ వీడియో విడుదల చేశారు చిత్రబృందం. ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts