telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో రాజశేఖర్ హెల్త్ అప్డేట్

Rajasekhar

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యే హీరో రాజశేఖర్ కుటుంబం అంతా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా అని నిర్ధారణ కావడంతో రాజశేఖర్, జీవితాలు హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. జీవితకు కరోనా తగ్గడంతో ఆమె డిశ్చార్జ్ అయిపోయి హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. తాజాగా రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రాజశేఖర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇక కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ మహమ్మారి కరోనాకు బలయ్యారు. కరోనా మహమ్మారి సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు అందరిని వణికిస్తోంది. సినిమా రంగంలోను పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలు ఈ మహమ్మారిని పడుతుండటంతో సామాన్యులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.

Related posts