టాలీవుడ్‌లో సమంతకు ఉన్నంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ సినిమాతో మాయ చేసిన ఈ బ్యూటీ..తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. సమంత అక్కినేని తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవలే ఓ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. తన క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ళ ను మైమరపిస్తుంది.
దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పచుకుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్ తోపాటు, రకరకాల ఫోటో షూట్స్‌తో ఆకట్టుకుంటుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ ఫోటోకి క్షణాల్లో లక్షల లైకులు వచ్చి పడ్డాయి. కేవలం ఈ ఫోటో పోస్ట్ చేసిన 3 గంటలలోనే 10 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో విభిన్న పాత్రలో శాకుంతలం అనే సినిమాలో సమంత నటిస్తుంది.