telugu navyamedia
సినిమా వార్తలు

ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. మొద‌టి భాగం ‘పుష్ప ది రైజ్‌’ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి తాజాగా మరో పాటను విడుదల చేసింది.

Image

రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ ‘సామీ సామీ’ పాటలు యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి.

తాజాగా నాలుగో పాట ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌ గుబురు గ‌డ్డం, పొడ‌వైన జుట్టుతో ఎర్ర‌టి నిలువు బొట్టుతో పూర్తి మాస్​లుక్​లో కనిపిస్తూ.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

ఈ పాట తెలుగు వెర్షన్‌ను నకాష్ అజీజ్ పాడగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు. అభిమానుల అంచనాలను అందుకునేలా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో తీసిన ‘పుష్ప’లో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది.

Related posts