telugu navyamedia
సినిమా వార్తలు

బ్రేకప్ పై ఘాటుగా స్పందించిన శృతి హాసన్

Shruti Hassan Boy Friend

శృతి హాసన్ టాలీవుడ్ లో శ్త్ర్ హీరోల సరసన పలు విజయవంతమైన సినిమాలల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే కొన్ని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తోంది. అయితే లండన్ కు చెందిన మైఖేల్ కోర్సెల్ అనే వ్యక్తితో చాలా కాలం పాటు శృతి హాసన్ ప్రేమాయణం సాగించింది. అతడిని తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేసింది. దీనితో మైఖేల్, శృతి పెళ్లి పీటలెక్కడం ఖాయం అని అనుకున్నారు. అంతలోనే బ్రేకప్ జరిగిపోయింది. ఈ ఏడాది వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రేమ విఫలం కావడంపై శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. “మైఖేల్ తో బ్రేకప్ జరిగిందని తెలియగానే తన సన్నిహితులంతా శృతి హాసన్ ఏంటి ఇలా చేస్తోంది అని అనుకున్నారు. కానీ మైఖేల్ నుంచి విడిపోవడం నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్… జీవితం పెర్ఫ్యూమ్ లాంటిది అంటూ వేదాంతం చెప్పడం మొదలుపెట్టింది. ఒకేసారి పలు రకాల పెర్ఫ్యూమ్స్ వాసనలు చూస్తే ఏది ఏ వాసనొ అర్థం కాదు. తన ప్రేమ వ్యవహారం కూడా అలాగే జరిగింది” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు శృతి మాటలని బట్టి తెలుస్తోంది.

Related posts