telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మీటూ”పై స్పందించిన షారుఖ్ ఖాన్

Sharukh

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా గతేడాది ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ చేసిన ఆరోపణలతో మీటూ ఉద్యమం ఉధృతంగా మారింది. తనుశ్రీ తర్వాత ఎందరో నటీమణులు, గాయనిలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు తమకు ఇండస్ట్రీలో ఎదురైన వేధింపుల గురించి చెప్పి ఎందరో బండారాలు బయటపెట్టారు. హాలీవుడ్‌లో మొదలైన “మీటూ” ఉద్యమం ఆ తర్వాత బాలీవుడ్‌ను, దక్షిణాదిని సైతం కుదిపేసింది. గతంలో పురుషుల నుంచి తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సినీ రంగంలోని పలు విభాగాల్లో పని చేస్తున్న మహిళలు వెల్లడించారు. పలువురు స్టార్ హీరోయిన్లు సైతం గతంలో తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడారు. ఈ ఉద్యమం గురించి తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన షారూక్ ఖాన్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మీటూ` గురించి ఇటీవలి కాలంలో చాలా చర్చ జరుగుతోంది. సినిమా పరిశ్రమలోనే కాదు.. చాలా రంగాలకు చెందిన మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం తామెదుర్కొన్న వేధింపుల గురించి మహిళలు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ ఉద్యమం గురించి ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అందరికీ లైంగిక వేధింపుల గురించి అవగాహన కలిగింది. ఇకపై ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది” అని షారూక్ అభిప్రాయపడ్డారు.

Related posts