telugu navyamedia
సినిమా వార్తలు

కశ్మీర్ పై పాక్ హీరోయిన్ వ్యాఖ్యలు… మండిపడుతున్న నెటిజన్లు

Mahira-Khan

సినీ ప్రముఖులు జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజన నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. ఆర్టికల్‌ 370 రద్దు అంశం ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. భారత్‌ను ఉగ్రవాదరహిత దేశంగా మార్చడంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ధైర్యసాహసాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కేవలం మోదీకే సాధ్యం. మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దుతోపాటు, జమ్మూకశ్మీర్‌ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ మద్దతు తెలియజేశారు. తాజాగా జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ సినీనటి, రయీస్ బాలీవుడ్ చిత్ర హీరోయిన్ మహిరాఖాన్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్ చేశారు. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి పూర్తిగా రద్దు చేసి, ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లుకు ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో పాక్ సినీనటి మహిరాఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పిస్తూ ఉన్న 370 ను రద్దు చేయడంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన దృష్ట్యా మహిరాఖాన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. “మేము పరిష్కరించడానికి ఇష్టపడని వాటిని సౌకర్యవంతంగా నిరోధించారా? ఇది ఇసుక మీద గీసిన గీతలకు మించినది, ఇది అమాయక ప్రాణాలను కోల్పోవడం గురించి స్వర్గం మండుతోంది …మేం నిశ్శబ్దంగా రోదిస్తున్నాం” అంటూ మహిరాఖాన్ ట్వీట్ చేశారు. మహిరాఖాన్ చేసిన ట్వీట్ పై 5,999 మంది స్పందించారు. “రయీస్ బాలీవుడ్ మూవీలో నటించాక మీ భవిష్యత్ అవకాశాలన్నీ దెబ్బతిన్నాయి…దీంతో అప్పటి నుంచి మీరు మానసిక వేదన, నిరాశలో ఉన్నారని మేం అర్థం చేసుకున్నాం” అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ బలూచిస్థాన్, సింధ్ ఎంత అభివృద్ధి చెందాయి ? దీనికోసం మీ గుండె ఎందుకు కాలిపోవడం లేదు ? పాక్ ఆక్రమిత బలూచిస్థాన్ అంటే మాకు అదే భావాలున్నాయి అంటూ నెటిజన్ వ్యాఖ్యానించారు. “కాశ్మీర్ మాది, మా ప్రభుత్వం శాంతిని కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది…మా కశ్మీర్ విషయంలో మేం ఏమైనా చేస్తాం… కాశ్మీర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది” అని మరో నెటిజన్ మహిరాఖాన్ కు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.

Related posts