*మరి కాసేపట్లో సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటి
* సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో బేటంపేట ఎయిర్‌పోర్టులో చిరు కామెంట్స్..
*సినిమా టిక్కెట్ల వివాదం పై ఈవేళతో శుభం కార్డు పడుతుంది..
* ఈ రోజు యండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతుంది..
* కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌తో సినిమా చర్చలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ అవుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. భేటీలో ప్రధానంగా.. థియేటర్ ధరలు, టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బెనిఫిట్ షోలు వంటివి చర్చకు రానున్నాయి.
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో భేగం పేట ఎయిర్ పోర్టులో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు…సీఎంఓ నుంచి ఆహ్వానం మాత్రం నా ఒక్కడే ఉందని నాకు తెలిసింది ..నాతో పాటు ఎవరెవరూ వస్తున్నారనేది నాకు తెలియదు..మీడియాలో ద్వారానే తెలుసుకున్నాను అని చిరంజీవి కామెంట్స్ చేశారు…
అయితే, గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి మహేశ్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్ రాగా.. మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు.
అయితే ఈ భేటిలో తొమ్మిది మంది సినీ ప్రముఖులు పాల్గొననున్నారు ..దర్శకుడు రాజమౌళి..కొరటాల శివ..మహేష్‌బాబు..ప్రభాస్.. ఆర్ నారాయణ మూర్తి..జూ ఎన్టీఆర్ మిగతా సినీ ప్రముఖులు ఉన్నారు. ఉదయం 11 గంటలకు సీఎంతో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు.