రైలులో మహిళా ప్రయాణికురాలిపై వేధింపులకు పాల్పడిన టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) పై సస్పెన్షన్ వేటు పడింది. ఢిల్లీ-రాంఛీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తనకు మత్తు మందున్న ఐస్‌క్రీమ్ ఇచ్చి వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ మంగళవారం ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు అధికారులు వెంటనే బాధిత మహిళకు ఫోన్ చేసి పూర్తి వివరాలు సేకరించారు. టీటీఈ ఎన్‌ఆర్ సరోజ్‌ను సస్పెండ్ చేసి, వెయిటర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
next post