విద్యార్టులకు విద్యా బుద్దులు చెప్పే ఓ ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. ఈ అమానుష సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటాసింగారంలో జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు(47) అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, బాధిత విద్యార్థిని షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాడితురాలు ఫిర్యాదు మేరకు ప్రసాదరావుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.