telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వెంటిలేటర్ల తయారీలోకి మారుతి సుజుకి!

ventilator

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్ లను, వెంటిలేటర్లను తయారు చేసేందుకు దేశీయ ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా అడుగుపెట్టింది. ఇందుకోసం అగ్వా హెల్త్ కేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ కంపెనీతో కలిసి నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని పేర్కొంది.

భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు తాము తయారు చేసే వెంటిలేటర్స్‌ కు తగిన టెక్నాలజీని అగ్వా హెల్త్‌ కేర్‌ అందిస్తుందని తెలిపింది. వెంటిలేటర్స్‌ తయారీకి కావాల్సిన నగదు, ప్రభుత్వ పరమైన అనుమతులకు అయ్యే ఖర్చులను తాము భరించనున్నామని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవగాహనా ఒప్పందంలో భాగంగా, మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి హరియాణ, కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనున్నామని తెలిపింది.

Related posts