టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ డెంగ్యూ బారిన పడ్డట్టు తెలుస్తుంది. గతవారం ప్లేట్ లెట్స్ సడెన్ గా పడిపోవడంతో .. ఈ నెల 18న ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు సమాచారం. ప్రత్యేక వైద్య బృందం అడివి శేష్‌కి వైద్యం అందిస్తున్నారు. ఆయన హెల్త్ కండీషన్ గురించి అధికారికంగా వెల్లడించనున్నారు.
ప్రస్తుతం అడివి శేష్ 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.
నేను ఆ విషయం బయటపెట్టడమే మహారాష్ట్ర సీఎంకు ఉన్న సమస్య : కంగనా