telugu navyamedia
రాజకీయ

న్యూ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణం..

పంజాబ్ కొత్త సీఎం ఎవ‌ర‌న్న ఉత్కంఠ కు తెర‌ప‌డింది. సుదీర్ఘ మంత‌నాలు, సాధ‌ర‌ణ స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని..చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ త‌దుప‌రి సీఎంగా ఖ‌రారు చేశారు. ఈ రోజు  నూత‌న‌ సీఎంగా చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చన్నీతో ప్రమాణం చేయించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తొలి దళిత నేత చన్నీనే కావడం విశేషం.

డిప్యూటీ సీఎంలుగా సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని లతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ నవజోత్ సింగ్‌ సిద్ధూ హాజరయ్యారు. చామ్‌కౌర్‌సాహిబ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిద్ధూకు అత్యంత సన్నిహితుడు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.Punjab Cm Charanjit Singh Channi Oath Ceremony Today Live Updates News Charanjit Channi Became Punjab New Cm - Punjab Cm Oath Ceremony Live: पंजाब के नए सीएम बने चरणजीत चन्नी, सुखजिंदर रंधावा

అలాగే ..అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులు చన్నీ హయాంలోనూ పనిచేయబోతున్నారు. గత కొన్ని నెలలుగా అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన వారికి నేడు చన్నీ వర్గంలో చోటు ఇస్తున్నారు. చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా అమరీందర్ సింగ్‌తోపాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేసింది.

Charanjit Singh Channi takes oath as 16th Chief Minister of Punjab | Deccan Heraldమరోవైపు ఇప్పుడు అధికారంలోకి వస్తున్న చన్నీపై కూడా ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అంద‌రితోనూ మంచి సంబంధాలు ఉండ‌డంతో పాటు చర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ ద‌ళిత వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావడంతో ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది పంజాబ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో..రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా ద‌ళితుల‌ను ఆక‌ర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చ‌ర‌ణ్‌జిత్ సింగ్ స‌న్నీకి అవ‌కాశం ఇచ్చింద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

Charanjit Singh Channi to be next Punjab CM, to take oath on Sep 20 | The  Sen Times

Related posts