మెగాస్టార్ చిరంజీవి తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 38వ పుట్టిని జరుపుకుంటున్నాడు.. . చెర్రీ పుట్టిన రోజు కానుకగా ఆచార్య చిత్ర యూనిట్ట్మె స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ నీలిరంగు కుర్తా ధరించి ఫ్లూట్ పట్టుకున్నాడు. చిన్న కట్టె పైన ఏదో ధీర్ఘంగా రాస్తున్నట్లు రామ్ చరణ్ లుక్ అట్రాక్టివ్‌గా ఉంది.
ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా.. రామ్ చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర దాదాపు 40 నిమిషాలు ఉంటుందని విశ్వసనీయ వర్గాల టాక్.
ఈ సినిమాతో తొలిసారి తన తండ్రి గారైన మెగాస్టార్ చిరంజీవితో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోండగా చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ‘ఇప్పటికే ఇది బ్లాక్ బస్టర్ ఏడాది. వచ్చే నెలలో మరింత పెద్ద బ్లాక్ బస్టర్ చేసే వరకు ఆగలేపోతున్నాం’ అంటూ ట్విట్టర్లో తెలిపింది.
.