telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మికకు గూగుల్ సర్‌ప్రైజ్..

Rashmika

తెలుగులో స్టార్ కథానాయకిగా కొనసాగుతూనే తమిళ పరిశ్రమ మీద కూడ దృష్టి పెట్టింది హీరోయిన్ రష్మిక మందన్న. తమిళంలో ఆమె నటిస్తున్నమొదటి సినిమా ‘సుల్తాన్’. స్టార్ హీరో కార్తీ నటిస్తున్న ఈ చిత్రాన్ని భాగ్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ ముందే చాలా భాగం షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఈమధ్యే చివరి షెడ్యూల్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రంతో కొలీవుడ్ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని రష్మిక భావిస్తోంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్. కార్తీ చేసిన అన్ని చిత్రాల్లోకి ఈ చిత్రమే బెస్ట్ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది. లాక్ డౌన్ విరామంలో పూర్తైన చిత్రీకరణ తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగియడంతో చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కార్తీ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అయితే.. తాజాగా రష్మికకు గూగుల్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చింది. గూగుల్‌ లో “నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా” అని టైప్‌ చేస్తే…”రష్మిక మందన్న.. నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియాగా మారింది. ఆమె దుస్తుల ఎంపిక మమ్మల్ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఇప్పుడు ఆమె సరికొత్త లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది” అని కూడా వస్తుంది. దీంతో రష్మిక ఫ్యాన్స్‌ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related posts