telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వినాయక నిమజ్జనంలో సల్మాన్ తీన్మార్ డ్యాన్స్… వీడియో వైరల్

Salman-KHan

బాలీవుడ్ సినీ ప్రముఖులు వినాయక చవితి ఉత్సవాల్లోఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, శిల్పాశెట్టి, కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తదితరులు గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. సల్మాన్ సోద‌రి అర్పితా ఖాన్ ప్ర‌తి ఏడాది త‌మ ఇంట్లో వినాయ‌కుడిని నెల‌కొల్పి ఎంతో ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని నెల‌కొల్ప‌గా, మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం చేశారు. నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన స‌ల్మాన్ ఖాన్, స్వ‌ర భాస్క‌ర్, డైసీ షా తీన్మార్ స్టెప్పులు వేశారు. బీట్స్‌కి త‌గ్గ‌ట్టుగా స‌ల్మాన్ వేసిన స్టెప్పులు అక్క‌డి వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. స‌ల్మాన్ డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. అలానే స‌ల్మాన్ త‌న మేన‌ల్లుడు అహిల్‌ని ఎత్తుకొని వినాయ‌కుడికి హార‌తి ఇస్తున్న వీడియోతో పాటు త‌న త‌ల్లి స‌ల్మా ప‌క్క‌న కూర్చొని భ‌జ‌న చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ తారలు నేహా ధూపియా, అంగద్ బేడీ తదితరులు కూడా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. స‌ల్మాన్ న‌టించిన “ద‌బాంగ్-3” చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. “ఇన్షా అల్లా” అనే చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.

Related posts