telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ పెద్ద వ్యక్తి రాత్రికి పబ్బుకు రమ్మన్నాడు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Kalyani

తాజాగా మీటూ అంశంపై తమిళ నటి కళ్యాణి (పూర్ణిత) రియాక్ట్ అవుతూ ఓపెన్ అయింది. లైంగిక దోపిడీ అనేది ఒక్క సినిమాల్లోనే కాదు బుల్లితెరపై కూడా ఉందంటూ తన అనుభవాలు చెప్పుకొచ్చింది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలున్నాయని తెలిపింది. కేరళ రాష్ట్రానికి చెందిన నటీమణి కళ్యాణి మొదట తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని కార్యక్రమాల్లో నటించి క్రమంగా కెమెరాకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ ఆమె నిష్క్రమణ ఉన్న వెనుక కారణాలేంటి? అనే విషయమై ఆరాదీసింది. అయితే తాను నటనకు దూరం కావడానికి కారణం లైంగిక వేధింపులు, కమిట్‌మెంట్ అంశాలే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది నటి కళ్యాణి. తాను ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలో చాలా నిర్మాణ సంస్థలు ఫోన్ చేసి అవకాశం ఇస్తామని చెప్పేవారని, కాకపోతే అదే సమయంలో అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని అడిగేవారని చెప్పింది. మొదటి అడ్జెస్ట్‌మెంట్‌ అంటే కాల్‌షీట్స్‌కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి ఓకే చెప్పేదని, కానీ.. ఆ తర్వాత అసలు అర్థం తెలియడంతో అడ్జెస్ట్‌మెంట్‌ అన్న పదం వినగానే ఫోన్‌ కట్‌ చేసేవాళ్లమని తెలిపింది. అలా వచ్చే అవకాశాలు అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే ఫోన్ కట్ చేసేదాన్నని చెప్పింది కళ్యాణి. అంతేకాదు సినిమాల్లోనే గాక బుల్లితెర ఇండస్ట్రీలోనూ ఈ రకమైన ధోరణి ఉందని కళ్యాణి పేర్కొంది. తనకు అలాంటి చేదు అనుభవాలు చాలా ఎదురయ్యాయని చెప్పింది. ఓ టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన పెద్ద వ్యక్తి రాత్రికి పబ్బుకు రావాలని అన్నాడని, దానికి తాను కుదరదని చెప్పడంతో ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పింది. ఇలాంటి పరిణామాల కారణం గానే నటనకు దూరం కావాల్సి వచ్చిందని కళ్యాణి తెలపడం విశేషం.

Related posts